2. రామజానకీవిలాసము
ఇందులో సీతారాముల పరస్పరానురాగముపవర్ణింపబడినది. శ్రీరామచంద్రమూర్తి సీతాముఖచం ద్రసౌందర్యాన్ని వర్ణించిన పరమాద్భుతములైన భావచిత్రాలను రెండింటిని ముచ్చటించుకుందాం-
వదనమమృతరశ్మిం పశ్య కాన్తే తవోర్వ్యామ్ అనిలతులనదణ్డేనాస్య వార్ధౌ విధాతా । స్థితమతులయదిన్దుః ఖేచరోఽభూల్లఘుత్వాత్ క్షిపతిచ పరిపూర్త్యై తస్య తస్య తారా కిమేతత్
అన్వయం - కాంతే ! ఉర్వ్యాం స్థితం తవ వదనం , క్షీరాబ్ధౌ స్థితం అమృతరశ్మిం చ విధాతా అనిలతులనదణ్డేన స్థితమ్ అతులయత్ | ఇన్దుః లఘుత్వాత్ ఖేచరో భూత్ | తస్య పరిపూర్త్యై తారాః క్షిపతి. కిమేతత్ ? = అవునా? (వివరణ)
ఓ సీతా ! నీ ముఖ సౌందర్యాన్ని తూచడానికి ఒక ప్రక్క భూమిపై నిన్నూ , మరియు గాలిని (తులాదండంగా) ఉపయోగించాడు క్షీరాబ్దిలో ఉన్న చంద్రుణ్ని ఒకప్రక్క ఉంచి, అది సరి తూగక అనన్త కాలంగా కొన్ని కోట్లకొలది నక్షత్రాలను ఇంకా వేస్తున్నా నీ ముఖం యొక్క అసాధారణ తేజస్సు మరియు గుణాలను పోల్చలేక, ఆ తూనిక సాధ్యపడలేదు. ఫలితంగా, చంద్రుడు తన లఘుత్వం (తేలికదనం) వల్ల ఆకాశంలో ఉన్నత స్థానానికి ఎగిరిపోయాడు. నీ ముఖం అనేది స్వయంగా సర్వోత్కృష్టమైనది! అవునా?
స్వర్ణం సువర్ణే దహనే స్వదే హం -చిక్షేప కాంతిం తవ దన్తపంక్తిమ్ |
విలోక్య పూర్ణం మణిబీజపూర్ణం - ఫలం విదీర్ణం నను దాడిమస్య ॥
బంగారము నీ దేహకాంతిని చూసి సిగ్గుపడి అగ్నిలో దూకినది. దానిమ్మ పండు నీ ముత్యాలవంటి దంతపంక్తిని చూసి అసూయతో పొట్టను చెక్కలు చేసుకుంటున్నదేమో